Telangana Rains Update:Red alert Isuued in Many districts of Telangana ahead of heavy rains | తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణపై వరుణుడి ప్రతాపంతో వరుసగా నాలుగో రోజు కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. శని, ఆదివారాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో చెరువులు, కుంటలు నిండుకున్నాయి. ఆదివారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది.
#TelanganaRains
#Floods
#Hyderabad